ఈడీ కేసుల్లో నేర నిరూపణ ఎంత?

9
- Advertisement -

ఈడీపై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్. ఈడీ కేసుల్లో నేర నిరూపణ జరిగిన వాటి శాతం ఎంత? చెప్పాలని ప్రశ్నించారు. గురువారం ఒక కేసు విచారణలో సందర్భంగా బీపీఎస్ఎల్ కుంభకోణం విచారణ ఇంకా పూర్తవలేదని ఈడీకి గుర్తుచేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.

ఈడీ బాగా పనిచేస్తుందని, తమకు ప్రచారం చేసుకునే వీలు లేకుండా పోయిందని తెలిపారు ఈడీ తరపు న్యాయవాది. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఈడీ కేసుల్లో శిక్షలు పడడమే తక్కువగా ఉందని, విచారణే లేకుండా ఏళ్ల తరబడి నిందితులకు జైలు శిక్ష విధిస్తోందని వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్.

Also Read:కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల ఆడబిడ్డలు

గతంలోనూ పలుమార్లు ఈడీ తీరును తప్పుబట్టింది సుప్రీం కోర్టు.

- Advertisement -