నచ్చినట్లు ఉండాలంటే పెళ్లి ఎందుకు?

4
- Advertisement -

నచ్చినట్లు స్వతంత్రంగా ఉండేందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకు? అని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. ఇద్దరూ ఇష్టపూర్తిగానే పెళ్లి చేసుకున్నప్పుడు, స్వతంత్రంగా ఎలా జీవిస్తారు..నచ్చినట్లు ఉండాలంటే పెళ్లి ఎందుకు? అని మండిపడింది.

పిల్లల కోసం విభేదాలు పక్కన పెట్టి కలిసి జీవించండి… ఓ దంపతుల కేసులో సూచించి, తీర్పునిచ్చింది సుప్రీంకోర్టు. జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాన్ని జారీ చేసింది. వారు విడాకులు ఇవ్వడం తమకు ఇష్టం లేదని పేర్కొన్నప్పటికీ, ఇరువురు పక్షాలు సంయుక్తంగా వివాహ రద్దు పిటిషన్ వేశారని గుర్తించింది.

అయితే దంపతులు ఇద్దరూ.. కోర్టు ఎదుట హాజరై, అన్ని వివాదాలను పరిష్కరించుకున్నామని, పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని తెలిపారు.

Also Read:జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు!

- Advertisement -