డిజిటల్ అరెస్టులపై సుప్రీం

5
- Advertisement -

డిజిటల్ అరెస్టులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అన్ని రాష్ట్రాలకు, సీబీఐకి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు. డిజిటల్ అరెస్టు కేసుల దర్యాప్తుకు వనరులు, సైబర్ నిపుణుల అవసరం, తదితర అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.

అన్ని రాష్ట్రాలలో డిజిటల్ అరెస్ట్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ల వివరాలు ఇవ్వాలని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల నేపథ్యంలో డిజిటల్ అరెస్టులపై సీబీఐ దర్యాప్తుకు సుముఖత వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.

సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించి తగిన ఆదేశాలు ఇస్తామని వెల్లడించింది సుప్రీంకోర్టు.

Also Read:కాంగ్రెస్ గెలిస్తే రౌడీ రాజ్యమే!

- Advertisement -