అబార్షన్‌పై సుప్రీం కీలక తీర్పు

87
- Advertisement -

అవివాహిత మహిళల అబార్షన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం కీలక తీర్పు వెలువరించింది. గ‌ర్భాన్ని తొల‌గించుకునేందుకు మ‌హిళ‌లు వివాహితులై ఉండాల్సిన నియ‌మం ఏమీ లేద‌ని…సుర‌క్షిత‌మైన‌, చ‌ట్ట‌ప‌ర‌మైన అబార్ష‌న్‌కు మ‌హిళ‌లు ఎవ‌రైనా అర్హులే అని వెల్లడించింది. మ‌ణిపూర్‌కు చెందిన ఓ మ‌హిళ దాఖ‌లు చేసిన కేసులో సుప్రీం ఈ తీర్పునిచ్చింది.

మైన‌ర్లు, రేప్ బాధితులు, గ‌ర్భ స‌మ‌స్య‌లు ఉన్న‌వాళ్లు త‌మ ప్రెగ్నెన్సీని 24 వారాల వ‌ర‌కు ట‌ర్మినేట్ చేసే అవ‌కాశం ఉంది. కానీ ఇష్ట‌పూర్వకంగా శృంగారం పాల్గొన్న వారి కేసుల్లో మాత్ర‌మే ఆ నియ‌మం 20 వారాలు మాత్ర‌మే ఉంది. ఈ తేడా ఉండ‌రాదు అని కోర్టు ఇవాళ అభిప్రాయ‌ప‌డింది.

వివాహితుల అత్యాచారం విష‌యంలోనూ ప్రెగ్నెన్సీ యాక్ట్ వ‌ర్తిస్తుంద‌ని కోర్టు తెలిపింది. వివాహిత మ‌హిళ‌లు, అవివాహిత మ‌హిళ‌ల మ‌ధ్య తేడాను చూడ‌డం కృత్రిమం అవుతుంద‌ని, అది రాజ్యాంగ వ్య‌తిరేకం కూడా అవుతుంద‌ని సర్వోన్నత న్యాయస్ధానం అభిప్రాయపడింది.

- Advertisement -