Supreme Court: బిహార్‌లో కూలుతున్న బ్రిడ్జిలు.. సుప్రీం నోటీసులు

20
- Advertisement -

బిహీర్‌లో వరుసగా బ్రిడ్జిలు కూలుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బ్రిడ్జిలు కూలుతున్న సంఘటనపై స్పందన తెలియజేయాలంటూ బీహార్‌ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న అన్ని వంతెనలు, నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిలపై అత్యున్నత స్థాయి స్ట్రక్చరల్‌ ఆడిట్‌ నిర్వహించాలని సూచించింది.

ఇక సాధ్యాసాధ్యాలను బట్టి బలహీనమైన నిర్మాణాలను కూల్చివేయడం లేదా పునర్నిర్మించడం వంటి చర్యలు చేపట్టాలని నోటీసుల్లో పేర్కొంది. ఇటీవలె బిహార్‌లో అనేక బ్రిడ్జిలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ పిటిషనర్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

సీజేఐ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.

Also Read:మల్లన్న సాగర్ నుండి నీళ్లు వదలాలి:వంటేరు

- Advertisement -