మార్చి 2026లో ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం తప్ప క్రిస్టియానిటీ లేదా ఇతర ఏ మతానికైనా మారితే షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదాను కోల్పోతారని పునరుద్ఘాటించింది. అయితే తిరిగి స్వమతంలోకి మారినప్పుడు కొన్ని షరతులతో ఆ హోదాను తిరిగి పొందవచ్చని స్పష్టం చేసింది.
హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతం కాకుండా క్రిస్టియానిటీ లేదా ఇతర మతాల్లోకి మారినప్పుడు ఒక వ్యక్తి ఎస్సీ హోదాను కోల్పోతాడంటూ మార్చి 2026లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్‌ను పరిశీలించామని, తమ మునుపటి నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి లోపాలు లేవని తెలిపింది.
మేము రివ్యూ పిటిషన్‌ను పరిశీలించాం మరియు 24.03.2026 నాటి తీర్పును క్షుణ్ణంగా చదివాం. రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లు లేదా లోపాలు కనిపించలేదు అని ధర్మాసనం పేర్కొంది.
Also Read:114 రఫేల్ జెట్లపై భారత్ లేఖపై ఫ్రాన్స్!
ఎస్సీ హోదా పునరుద్ధరణను కోరే వ్యక్తి వారు మొదట షెడ్యూల్డ్ కులంగా గుర్తించబడిన కులంలోనే జన్మించి ఉండాలి.వారు నిజాయితీగా తిరిగి హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతంలోకి మారి, అంతకుముందు స్వీకరించిన మతాన్ని పూర్తిగా వదులుకుని ఉండాలి.ఈ షరతుల్లో ఒక్కటి నెరవేర్చలేకపోయినా ఎస్సీ హోదా పునరుద్ధరణ దావా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.

