ఆక్సిజన్ కొరత…కేంద్రానికి సుప్రీం నోటీసులు

122
sc
- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ చాపకింద నీరులా కొరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా సెకండ్ వేవ్‌పై కేంద్రాన్ని నిలదీసింది సుప్రీం. దేశ‌వ్యాప్తంగా ప‌లు హైకోర్టుల్లో జ‌రుగుతున్న విచార‌ణ‌ల‌ను సుమోటోగా స్వీక‌రించింది.

ఆక్సిజ‌న్‌, ఇత‌ర కొవిడ్ సంబంధిత ఔష‌ధాలు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌పై జాతీయ ప్ర‌ణాళిక ఉందా అంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దేశంలో నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయని…వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది. లాక్‌డౌన్‌లు విధించుకునే అధికారం రాష్ట్రాల‌కు వ‌దిలేయాల‌న్న అంశాల‌పై కేంద్రం అభిప్రాయాన్ని తెలపాలని కోరింది.

ఢిల్లీ, బాంబే, సిక్కిం, క‌ల‌క‌త్తా, అల‌హాబాద్ హైకోర్టులు ప్ర‌స్తుతం కొవిడ్ సంసిద్ధ‌త‌కు సంబంధించిన అంశాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నాయి. ఆయా కోర్టులు విచార‌ణ‌లు కొన‌సాగించుకోవ‌చ్చ‌ని చెప్పిన అత్యున్న‌త న్యాయ‌స్థానం.. కొన్ని అంశాల‌ను మాత్రం త‌మ ప‌రిధిలోకి తీసుకుంటామ‌ని చెప్పింది.

- Advertisement -