- Advertisement -
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణపై భారత్ జోడో యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాహుల్.
చైనా 2,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, ప్రధాని మోదీ దాన్ని సరెండర్ చేశారని ఆరోపణలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.
2,000 చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించారు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్ బెంచ్. అలా స్పందించకపోతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉంటారని వాదించారు రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.
Also Read:అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్!
- Advertisement -

