ప్రశాంత్ కిషోర్‌పై సుప్రీం ఫైర్

4
- Advertisement -

బీహార్ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన జన సూరజ్ పార్టీ ప్రశాంత్‌ కిషోర్‌పై సుప్రీం కోర్టు మండిపడింది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌శాంత్ కిషోర్‌ కు చెందిన జ‌న్ సూరజ్ పార్టీ దారుణంగా ఓడిన విష‌యం తెలిసిందే. ఆ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ర‌ద్దు చేయాల‌ని కోరుతూ ప్ర‌శాంత్ కిషోర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను సుప్రీంకోర్టు తిర‌స్క‌రించింది.

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌భుత్వం త‌న సంక్షేమ ప‌థ‌కంతో ఓట‌ర్లకు డ‌బ్బులు పంచింద‌ని జ‌న్‌సూర‌జ్ పార్టీ ఆరోపించింది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిల్‌ను కొట్టిపారేసింది. ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని తిర‌స్క‌రించార‌ని, ఇప్పుడు మీరు ప‌బ్లిసిటీ కోసం న్యాయ ప్ర‌క్రియ‌ను వాడుకుంటార‌ని చీఫ్ జ‌స్టిస్ అన్నారు. మీకెన్ని ఓట్లు వ‌చ్చాయి, ఒక‌సారి ప్ర‌జ‌లు తిర‌స్క‌రిస్తే, రిలీఫ్ కోసం జుడిషియ‌ల్ ఫోరంను వాడుతున్నార‌ని, ఆ స్కీమ్‌ను ఎవ‌రో ఒక‌రు ముందుగా ఛాలెంజ్ చేసి ఉండాల్సింద‌ని కోర్టు పేర్కొన్న‌ది.

Also Read:KTR:ప్రజల గుండెల్లో కేసీఆర్ ధ్రువతార

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌న్‌సూర‌జ్ పార్టీ మొత్తం 238 సీట్ల‌లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెల‌వ‌లేదు.

- Advertisement -