దివ్యాంగులపై జోకులా?:సుప్రీం ఫైర్

6
- Advertisement -

దివ్యాంగులపై అవమానకరమైన జోకుల విషయంలో కామెడీయన్లపై సుప్రీం కోర్టు మండిపడింది. స్పీచ్‌ని కమర్షియలైజ్ చేస్తున్నప్పుడు, ఏదైనా సమాజ భావోద్వేగాలను దెబ్బతీయకూడదు అని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జోయ్‌మాల్య బగ్చీల బెంచ్ క్యూర్ SMA ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వేసిన పిటిషన్‌ను విచారించింది.

స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ బాధితులు, వారి కుటుంబాలకు సహాయం చేసే ఈ ఫౌండేషన్, వికలాంగులపై ఎగతాళి చేసే జోకులపై అభ్యంతరం వ్యక్తం చేసింది. పిటిషన్‌లో ప్రస్తావన పొందిన కామెడీయన్లలో సమయ్ రైనా, విపున్ గోయల్, బల్రాజ్ పరమజీత్ సింగ్ ఘై, సోనాలి ఠాక్కర్, నిశాంత్ జగదీష్ తన్వర్ ఉన్నారు.

ఫౌండేషన్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ అపరాజితా సింగ్ కోర్టుకు తెలిపారు. అందరూ క్షమాపణ అని తెలపగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి సెంటర్ తరఫున మాట్లాడుతూ, కామెడీయన్లు మరియు ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం మార్గదర్శకాలు సిద్ధం చేయడానికి సమయం అవసరమని తెలిపారు. పూర్తి నిషేధం సాధ్యం కాదు అని అన్నారు.

Also Read:బాన్సువాడలో పోచారం ఒంటరే!

జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానిస్తూ…మార్గదర్శకాలు ఒక్క ఘటనకే ప్రతిస్పందనగా కాకుండా, భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. నిపుణుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలి అన్నారు. కామెడీయన్లు తమ యూట్యూబ్ ఛానళ్లలో క్షమాపణ వీడియో/ప్రకటన పోస్ట్ చేయాలి మరియు తాము భరించడానికి సిద్ధంగా ఉన్న జరిమానా వివరాలు కోర్టుకు తెలియజేయాలి అని స్పష్టం చేసింది.

- Advertisement -