- Advertisement -
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. ఈ మేరకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఈ నెల 14 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉంది. అయితే బార్ అసోసియేషన్ వర్గాల విజ్ఞప్తుల మేరకు, ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే సెలవులు ప్రకటించారు.
గత నెల 26న బార్ అసోసియేషన్ ప్రతినిధులు వేసవి సెలవుల అంశంపై సీజేఐకి ఓ వినతి పత్రం అందించారు. ఢిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి నేపథ్యంలో సెలవులు ప్రకటించాలని కోరారు. దీనిపై జస్టిస్ ఎన్వీ రమణ సానుకూలంగా స్పందిస్తూ ముందుగానే సెలవులు ప్రకటించారు.
- Advertisement -