రజనీ మళ్లీ తేల్చేశాడు…

231
Support No One, Rajinikanth Tweets
- Advertisement -

తనపై ఆశలు పెట్టుకున్నరాజకీయ పార్టీలకు  సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోమారు షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో  తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదని ట్విటర్ వేదికగా కుండబద్దలు కొట్టారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గం ఆర్కే నగర్‌లో… ఉపఎన్నిక రసవత్తరంగా మారిన నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ఏప్రిల్ 12న జరిగే ఆర్కే నగర్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గంగై అమరన్.. ఇటీవల రజనీకాంత్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే.

దీంతో రజనీ బీజేపీకి మద్దతిస్తారన్న వార్తలు జోరందుకున్నాయి. దీనిపై రజనీ కూడా మౌనం దాల్చడంపై ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీ లాంచనమే అనుకున్నారు. అయితే, ఈ వార్తలకు చెక్ పెడుతు రజనీ తాను ఎవరికి మద్దతిచ్చేది లేదని తేల్చిచెప్పారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడైన గంగై అమరన్… తాను రజనీకాంత్ ఆహ్వానం మేరకే ఆయన ఇంటికి వెళ్లినట్టు ప్రకటించారు. తన తండ్రి ‘‘విజయం సాధించాలని’’ రజనీ ఆకాంక్షించినట్టు అమరన్ కుమారుడు వెంకట్ ప్రభు కూడా ట్వీట్ చేశాడు. దీంతో ఆయన మద్దతుపై పెట్టుకున్న ఆశలు వారికి రజనీ షాకిచ్చినట్టయింది.

ఈ ఉపఎన్నికలో అన్నాడీఎంకే తరపున శశికళ బంధువు దినకరన్, పన్నీర్ సెల్వం వర్గం తరపున మధుసూదనన్, జయ మేనకోడలు దీపలతో పాటు డీఎంకే కూడా బరిలోకి దిగింది.

- Advertisement -