గ్రీన్ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన రఘు మాస్టర్..

49
Raghu Master

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి జూబ్లీహిల్స్ పార్క్‌లో మొక్కలు నాటారు ప్రముఖ డాన్స్ మాస్టర్ రఘు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను తీసుకునే ఆక్సిజన్ కోసం నా వంతు బాధ్యతగా ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది. ప్రతి ఒక్కరు వారు పీల్చుకుని ఆక్సిజన్ కోసం 3 మొక్కలు నాటాలని కోరారు. ఈరోజు మొక్కలు నాటడం నాకు చాలా సంతోషంగా ఉందని కరోనా వైరస్ లాంటి ఈ సందర్భంలో మనం వాతావరణాన్ని రక్షించుకోవడం అందరి బాధ్యత. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

ఈ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని అందుకోసం నేను మా గురువు రాజ్ సుందరం మాస్టర్, మిత్రుడు రాఘవ లారెన్స్ మాస్టర్, నా భార్య గాయని ప్రణవి ఆచార్యను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు “వృక్ష వేదం” పుస్తకంను రఘు మాస్టర్‌కు అందజేయడం జరిగింది.