బిగ్ సి బ్రాండ్ అంబాసిడర్‌గా మహేష్‌..

36
mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు బిగ్ సి మొబైల్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బిగ్ సి సంస్థ మహేష్‌ బాబుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇకపై బిగ్ సి ప్రచారకర్తగా మహేశ్ బాబు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా, బిగ్ సి సంస్థకు ఇప్పటివరకు అంబాసిడర్లుగా వ్యవహరించింది హీరోయిన్లే కాగా, ఇప్పుడు మహేశ్ బాబు రూపంలో తొలిసారిగా ఓ హీరో బిగ్ సి సంస్థకు అంబాసిడర్ గా నియమితులయ్యారు.