మహాప్రస్ధానంలో సూపర్ స్టార్ అంత్యక్రియలు..

299
Superstar krishna funeral today
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. హైదరాబాద్ మహాప్రస్ధానంలో అంత్యక్రియలు జరగనుండగా అన్ని ఏర్పాట్లు చేశారు. తొలుత కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు. ఆ తర్వాత మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇక తమ అభిమాన నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరానున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కృష్ణకు ఘనంగా నివాళి అర్పించగా ఇవాళ మరికొంతమంది వచ్చే అవకాశం ఉంది.

కృష్ణ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాగా, కృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ ఇవాళ టాలీవుడ్ సినీ పరిశ్రమ బంద్‌ పాటించనుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -