సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 2.ఓ..బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈమూవీలో విలన్ గా నటించారు. ఎమీ జాక్సన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో సినిమాకి ప్రమోషన్ భారీగా చేపడుతున్నారు.
లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, యు/ఎ సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. ఈ సినిమా కోసం రజనీకాంత్ అభిమాను వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయని ట్రైలర్ ను చూస్తే అర్ధమైవుతోంది.
రోబోల మధ్య జరిగే పోరాటాన్ని చూడటానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు. దర్శకుడు శంకర్, రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన రోబో సినిమా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకొనున్నారని సమాచారం.