నితిన్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఈ మూవీ సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. నితిన్ సరసన రాశి ఖన్నా తో పాటు మరో హీరోయిన్‌గా నందిత శ్వేత నటిస్తుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతోన్న తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ మూవీ ట్రైలర్‌ను ప్రిన్స్ మహేష్ బాబు గురువారం సాయంత్రం విడుదల చేయనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో 70 మంది ఆర్టిస్టులు నటించడం విశేషం. ముఖ్యమైన పాత్రల్లో ప్రకాశ్ రాజ్, జయసుధ, రాజేంద్రప్రసాద్, ఆమని, సీనియర్ నరేశ్ కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్‌కు పాటలకి మంచి స్పందన వచ్చింది. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్‌లతో ఉన్న నితిన్ ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలని కసి మీద ఉన్నాడు. మరి ఈ సినిమాతో అయిన నితిన్‌కు విజయం వరిస్తుందో చూడాలి. ఈ మూవీ ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రావడాని సిద్ధమవుతోంది.