- Advertisement -
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పుట్టిన రోజు సందర్భంగా పలువురు నేతలు, సిని తారలు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షాలు తెలిపారు. విజయశాంతికి కలిసి మరో సారి నటించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పారు.
ఈ ఏడాది ఆమెకు చాలా బాగుండాలని, ఆమె అనుకున్న వన్నీ జరగాలని కోరుకుంటున్నానని మహేశ్ తన ట్వీట్టర్ ద్వారా తెలిపారు. విజయశాంతితో మహేశ్ బాబు మొదటిసారిగా 1989లో విడుదలయిన కొడుకు దిద్దిన కాపురం సినిమాలో బాలనటుడిగా నటించారు. ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మరో సారి విజయశాంతితో నటిస్తున్నారు.
- Advertisement -