‘వెంకీమామ‌’టైటిల్ సాంగ్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్‌

317
venkymama

విక్టరీ వెంకటేశ్, యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను తొలిసాంగ్‌గా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది. ఈ సాంగ్‌కు ప్రేక్ష‌కుల నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.

ఈ సాంగ్ మామ‌, అల్లుడు మ‌ధ్య ఉండే అంద‌మైన అనుబంధాన్ని తెలియ‌చేస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. సింపుల్‌, అర్థ‌మ‌య్యేలా ఈ పాట సాహిత్యాన్ని రామ‌జోగ‌య్య‌శాస్త్రి అందించారు. రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.