‘సూపర్’ గా 16 ఏళ్లు పూర్తి..

196
- Advertisement -

అనుష్క. నాగార్జున హీరో హీరోయిన్లుగా చేసిన సినిమా ‘సూపర్’. ఈ సినిమాతో అనుష్క టాలీవుడ్‌కు పరిచయమైంది. నాగార్జున చాలామంది కథానాయికలను తన సినిమాల ద్వారా పరిచయం చేశారు. అలా పరిచయమైన కథానాయికల్లో అగ్రస్థానానికి చేరిన నాయికగా అనుష్క నిలిచింది. అన్నపూర్ణ బ్యానర్‌లో నిర్మితమైన ఈ సినిమాకి, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ నెల 20వ తేదీతో ఈ సినిమా 16 ఏళ్లను పూర్తిచేసుకుంది. 2005 జూలై 22న విడుదలైన ‘సూపర్’ మూవీ మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా అనుష్క స్పందించింది. ఈ సినిమాతో తనకి అవకాశం ఇచ్చిన నాగార్జున.. పూరి జగన్నాథ్ కి ఆమె ధన్యవాదాలు చెప్పింది. అలాగే తనతో కలిసి పనిచేసిన సోనూసూద్ తో పాటు అందరికీ కూడా ఆమె థ్యాంక్స్ చెప్పింది. ఇక ఈ 16 ఏళ్లలో తనని సపోర్ట్ చేస్తూ, ఇంతగా ఆదరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది. ఈ 16 ఏళ్ల కెరియర్‌లో అనుష్క ఎన్నో విజయాలను సాధించింది.

- Advertisement -