టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..

58
- Advertisement -

ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈరోజు ఐపీఎల్ సూపర్ శాటర్ డే లో భాగంగా మరో మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఈ మ్యచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయ్. సన్ రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్‌ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఇక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఎలాంటి మార్పులు లేకుండా పోరుకు సిద్ధమైంది..

ఈ ఐపీఎల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్ రైజర్స్ తరువాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి మంచి జోరుమీదుంది. మరోవైపు ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొడుతుంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో రెండింట్లో ఓడి ఐదింట్లో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 10పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది.

తుది జట్లు :

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, జోష్ హేజిల్‌వుడ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

సన్‌రైజర్స్ హైదరాబాద్ : అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, శశాంక్ సింగ్, జె సుచిత్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్

- Advertisement -