‘కేజీఎఫ్ 2’ టీంపై మెగా పవర్‌స్టార్‌ ప్రశంసలు..

53
Ram Charan
- Advertisement -

కన్నడ రాకింగ్‌ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘కేజీఎఫ్ 2’ సినిమా రూపొందింది. ఈ చిత్రం ప్యాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులే కాదు. సినీ ప్రముఖులూ ప్రశంసిస్తున్నారు. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రాంచరణ్‌ హీరో యష్‌,కేజీఎఫ్‌ టీంపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ఆయనొక ట్వీట్‌ చేశారు.

“ముందుగా హోంబలే ఫిలిమ్స్ వారికి కంగ్రాట్స్ చెబుతున్నాను. అలాగే నా బ్రదర్ ప్రశాంత్ నీల్ కి కూడా. ప్రశాంత్ నీల్ తన టేకింగ్‌తో మరోసారి అద్భుతాలు చేశాడు. యశ్ స్క్రీన్ ప్రెజెన్స్ గొప్పగా ఉంది. పెర్ఫార్మెన్స్ తో ఆయన అదరగొట్టేశాడు. సంజయ్ దత్.. రవీనా టాండన్.. ప్రకాశ్ రాజ్.. రావు రమేశ్ తమ బెస్ట్ ఇచ్చారు. అలాగే శ్రీనిధి శెట్టి.. అర్చన ఫెంటాస్టిక్ వర్క్ ను అందించారు. ఈ సినిమా సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ కంగ్రాట్స్ ” అంటూ చెర్రీ ట్విటర్‌ వేదికగా తెలిపాడు.

హోంబేలే ఫిలిమ్స్ బ్యానర్స్‌పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేస్తూ దూసుకుపోతోంది. రికార్డు స్థాయి వసూళ్లతో విస్మయులను చేస్తోంది.

- Advertisement -