ఐపీఎల్- 11 సీజన్ వేటను సన్‌రైజర్స్ హైదరాబాద్ గొప్పగా మొదలెట్టింది. సొంత ప్రేక్షకుల ముందు ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన రైజర్స్.. ఉప్పల్ స్టేడియంలో సోమవారం జరిగిన తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై 9 వికెట్లతో ఘన విజయం సాధించింది. ధవన్ (57 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 నాటౌట్), విలియమ్సన్ (35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 36 నాటౌట్) చెలరేగడంతో ప్రత్యర్థి నిర్దేశించిన 126 పరుగుల లక్ష్యాన్ని రైజర్స్ 15.5 ఓవర్లలో ఒకే వికెట్ కోల్పోయి అలవోకగా ఛేదించింది. అంతకుముందు ఆతిథ్య బౌలర్ల ధాటికి రాజస్థాన్ నిర్ణీత ఓవర్లలో 9వికెట్లకు 125 రన్స్ మాత్రమే చేసింది. సంజూ శాంసన్ (42 బంతుల్లో 5 ఫోర్లతో 49) ఫర్వాలేదనిపించాడు. జట్టులో నలుగురు మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. సిద్దార్థ్ కౌల్, షకీబల్ రెండేసి వికెట్లతో సత్తాచాటారు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ధవన్‌కు దక్కింది.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్:
రహానె (సి) రషీద్ (బి) కౌల్ 13; షార్ట్ రనౌట్ 4; శాంసన్ (సి) రషీద్ (బి) షకిబ్ 49; స్టోక్స్ (సి) విలియమ్సన్ (బి) స్టాన్లేక్ 5; త్రిపాఠి (సి) పాండే (బి) షకిబ్ 17; బట్లర్ (బి) రషీద్ 6; గౌతమ్ (సి) సాహా (బి) కౌల్ 0; గోపాల్ (సి) పఠాన్ (బి) భువనేశ్వర్ 18; ధవళ్ నాటౌట్ 3; ఉనద్కత్ రనౌట్ 1; లాలిన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 125; వికెట్ల పతనం: 1-6, 2-52, 3-63, 4-92, 5-94, 6-96, 7-115, 8-122, 9-123; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-30-1; స్టాన్లేక్ 4-0-29-1; షకిబ్ అల్హసన్ 4-0-23-2; సిద్ధార్థ్ కౌల్ 4-0-17-2; రషీద్‌ఖాన్ 4-0-23-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్:
సాహా (సి) లాలిన్ (బి) ఉనద్కత్ 5; ధావన్ నాటౌట్ 77; విలియమ్సన్ నాటౌట్ 36; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (15.5 ఓవర్లలో వికెట్ నష్టానికి) 127; వికెట్ల పతనం: 1-6; బౌలింగ్: ధవళ్ కులకర్ణి 2.5-0-18-0; ఉనద్కత్ 3-0-28-1; కృష్ణప్ప గౌతమ్ 1-0-9-0; లాలిన్ 2-0-20-0; శ్రేయస్ గోపాల్ 3-0-17-0; స్టోక్స్ 2-0-21-0; షార్ట్ 2-0-9-0.