ఐపీఎల్‌-11 ఫైనల్లో చెన్నై..

229
- Advertisement -

ఓటమి అంచుల్లో నుంచి అద్భుతంగా పుంజుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌.. ఐపీఎల్‌-11 ఫైనల్‌కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడింది. ఫైనల్లోకి వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ఓపెనర్ శిఖర్ ధవన్ గోల్డెన్ డక్‌తో మొదలైన వికెట్ల పతనం కొనసాగింది. చివరికి బ్రాత్‌వైట్ పుణ్యమా అని గౌరవ ప్రదమైన స్కోరు చేసినా, దానిని కాపాడుకోలేక మ్యాచ్‌ను చెన్నైకి సమర్పించుకుంది. ఫలితంగా ఫైనల్లోకి వెళ్లాలంటే రెండో క్వాలిఫయర్ మ్యాచ్ ఆడాల్సిన స్థితికి చేరుకుంది. ఇక హైదరాబాద్‌పై గెలిచిన చెన్నై నేరుగా ఫైనల్లోకి ప్రవేశించింది.

SunRisers Hyderabad vs Chennai Super Kings

సన్‌రైజర్స్‌: ధవన్‌ (బి) చాహర్‌ 0, శ్రీవత్స్‌ గోస్వామి (సి అండ్‌ బి) ఎన్‌గిడి 12, విలియమ్సన్‌ (సి) ధోనీ (బి) శార్దూల్‌ ఠాకూర్‌ 24, మనీష్‌ పాండే (సి అండ్‌ బి) జడేజా 8, షకీబ్‌ (సి) ధోనీ (బి) బ్రావో 12, యూసుఫ్‌ పఠాన్‌ (సి అండ్‌ బి) బ్రావో 24, బ్రాత్‌వైట్‌ (నాటౌట్‌) 43, భువనేశ్వర్‌ (రనౌట్‌) 7, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 20 ఓవర్లలో 139/7; వికెట్ల పతనం: 1-0, 2-34, 3-36, 4-50, 5-69, 6-88, 7-139; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-31-1, ఎన్‌గిడి 4-0-20-1, శార్దూల్‌ ఠాకూర్‌ 4-0-50-1, డ్వేన్‌ బ్రావో 4-0-25-2, రవీంద్ర జడేజా 4-0-13-1.

చెన్నై: వాట్సన్‌ (సి) గోస్వామి (బి) భువనేశ్వర్‌ 0, డుప్లెసిస్‌ (నాటౌట్‌) 67, సురేష్‌ రైనా (బి) సిద్దార్థ్‌ కౌల్‌ 22, రాయుడు (బి) సిద్దార్థ్‌ కౌల్‌ 0, ధోనీ (బి) రషీద్‌ 9, బ్రావో (సి) ధవన్‌ (బి) రషీద్‌ 7, జడేజా (సి అండ్‌ బి) సందీప్‌ 3, చాహర్‌ (సి) బ్రాత్‌వైట్‌ (బి) సందీప్‌ 10, హర్భజన్‌ (రనౌట్‌) 2, శార్దూల్‌ ఠాకూర్‌ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 19.1 ఓవర్లలో 140/8; వికెట్ల పతనం: 1-0, 2-24, 3-24, 4-39, 5-57, 6-62, 7-92, 8-113; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3.1-0-14-1, సందీప్‌ శర్మ 3-0-30-2, సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-32-2, బ్రాత్‌వైట్‌ 3-0-31-0, రషీద్‌ ఖాన్‌ 4-0-11-2, షకీబ్‌ ఉల్‌ హసన్‌ 2-0-20-0.

- Advertisement -