ఐపీఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 11 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఐపీఎల్ 12వ సీజన్ కోసం సర్వం సిద్ధమైంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో బెంగళూరు తలపడనుంది. కోహ్లీ వర్సెస్ ధోనిగా ఈ మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ఒక మార్చి 29న తొలి మ్యాచ్‌లో సొంతగడ్డపై రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఈ సందర్భంగా వినూత్న ప్రచారం మొదలుపెట్టిన సన్ రైజర్స్ టికెట్స్‌పై ఆఫర్ ప్రకటించింది.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కెపాసిటీ 25వేలు ఉండగా మార్చి 13 ఉదయం 11 గంటల నుండి టికెట్ల అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. ముందుగా టిక్కెట్ కొనుక్కున్న వారికీ రూ.500కే టిక్కెట్ అమ్ముతున్నట్లు ప్రకటించింది సన్‌రైజర్స్ యాజమాన్యం.
ఈ విషయాన్ని సన్‌రైజర్స్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్ తెలిపారు. ఇప్పటికే సన్‌రైజర్స్ హైదరాబాద్ శిఖర్ ధావన్, వృద్ధిమాన్ సాహాలాంటి ప్లేయర్లను విడుదల చేసి జట్టులో కీలక మార్పులు చేసింది.