పంజాబ్‌పై సన్ రైజర్స్ విజయం..

34
Sunrisers Hyderabad

సన్ రైజర్స్ ఎట్టేకేలకు ఐపీఎల్ 14వ సీజన్‌లో బోణీ కొట్టింది. చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. వికెట్ కోల్పోయి 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. బెయిర్ స్టో(63 నాటౌట్), కేన్ విలియమ్సన్(16 నాటౌట్).. ఇద్దరూ నిలకడగా ఆడి 18.4 ఓవర్లలో 121 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఫేబియన్ ఆలెన్ ఒక వికెట్ తీసుకున్నాడు.

అంతకు ముందు టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ కింగ్స్ 19.4 ఓవర్లలలో 120 పరుగులకు ఆలౌటైంది. సన్‌రైజర్స్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో పంజాబ్‌ ఆది నుంచే వికెట్లు కోల్పోయింది. దాంతో పంజాబ్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యల్ప స్కోరు నమోదు చేసింది. ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ (22; 25 బంతుల్లో 2×4), యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌ (22; 17 బంతుల్లో 2×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. ఖలీల్‌ అహ్మద్‌ 3/21, అభిషేక్‌ శర్మ 2/24 రాణించారు. ఫస్ట్ నుంచే సన్ రైజర్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి.. పంజాబ్ బ్యాట్స్ మెన్‌ను కట్టడి చేశారు. 9 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది.