సన్‌రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో వరుసగా మూడో విజయం. బ్యాటుతో గొప్పగా రాణించకున్నా ఆ జట్టు బంతితో మరోసారి అదరగొట్టింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 11 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (63; 43 బంతుల్లో 7×4, 2×6), హేల్స్ (45; 39 బంతుల్లో 4×4) మెరవడంతో మొదట సన్‌రైజర్స్ 7 వికెట్లకు 151 పరుగులు సాధించింది. ఛేదనలో రాజస్థాన్ తడబడింది. వేగంగా బ్యాటింగ్ చేయలేకపోయింది. సందీప్ శర్మ (1/15), సిద్ధార్థ్ కౌల్ (2/23), రషీద్ ఖాన్ (1/31) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 6 వికెట్లకు 140 పరుగులే చేసింది. ఓపెనర్ రహానె (65 నాటౌట్; 53 బంతుల్లో 5×4, 1×6) అర్ధశతకంతో అజేయంగా నిలిచినా.. వేగం లోపించిన ఆ ఇన్నింగ్స్‌తో ఫలితం లేకపోయింది. శాంసన్ (40; 30 బంతుల్లో 3×4, 1×6) రాణించాడు. విలియమ్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: హేల్స్ (సి) శాంసన్ (బి) గౌతమ్ 45; ధావన్ (బి) గౌతమ్ 6; విలియమ్సన్ (సి) బట్లర్ (బి) సోధి 63; మనీష్ (సి) రహానె (బి) ఉనద్కత్ 16; షకిబ్ (బి) ఆర్చర్ 6; యూసుఫ్ పఠాన్ (సి) కులకర్ణి (బి) ఆర్చర్ 2; సాహా నాటౌట్ 11; రషీద్ ఖాన్ (సి) స్టోక్స్ (బి) ఆర్చర్ 1; థంపి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 151;
వికెట్ల పతనం: 1-17, 2-109, 3-116, 4-133, 5-137, 6-143, 7-150;
బౌలింగ్: గౌతమ్ 4-0-18-2; కులకర్ణి 2-0-20-0; ఆర్చర్ 4-0-26-3; ఉనద్కత్ 3-0-33-1; సోధి 3-0-25-1; స్టోక్స్ 3-0-20-0; లొమ్రార్ 1-0-8-0.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానె నాటౌట్ 65; త్రిపాఠి (బి) సందీప్ 4; శాంసన్ (సి) హేల్స్ (బి) కౌల్ 40; స్టోక్స్ (బి) పఠాన్ 0; బట్లర్ (సి) ధావన్ (బి) రషీద్ 10; లొమ్రార్ (సి) సాహా (బి) కౌల్ 11; గౌతమ్ (సి) ధావన్ (బి) థంపి 8; ఆర్చర్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు 1 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 140;
వికెట్ల పతనం: 1-13, 2-72, 3-73, 4-96, 5-128, 6-139;
బౌలింగ్: సందీప్ 4-0-15-1; షకిబ్ 4-0-30-0; థంపి 2-0-26-1; కౌల్ 4-0-23-2; రషీద్ 4-0-31-1; యూసుఫ్ 2-0-14-1.