గ్లామర్ పాత్రలతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నది సన్నీలియోన్. కరెంట్తీగ, గరుడవేగ చిత్రాల్లో ప్రత్యేక గీతాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. తాజాగా ఈ భామ ఓ తెలుగు చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సౌత్ ఇండియన్ కల్చర్స్ బ్యాక్ డ్రాప్ తో చారిత్రాత్మక యుద్ధ నేపథ్యంలో తెరకెక్కనున్న సినిమాలో సన్నీలియోన్ హీరోయిన్ గా నటిస్తోంది. నవదీప్, నాజర్ లు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం కత్తి సాము, గుర్రపు స్వారీతోపాటు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకోనుందట సన్నీ. ముంబైలో ప్రముఖ ట్రైనర్ సన్నీలియోన్ కు శిక్షణ ఇవ్వనున్నాడట. భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం డైరెక్టర్ అండ్ టీంకు సన్నీలియోన్ 150 రోజుల కాల్సీట్లను ఇచ్చినట్లు సమాచారం.
బాహుబలి, 2.0 సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ చేసిన సంస్థలు ఈ చిత్రానికి పనిచేయనున్నాయి. ఈ చిత్రంలో దాదాపు 70 నిమిషాలపాటు గ్రాఫిక్స్ ఉంటాయని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనుంది. ఈ మూవీ టైటిల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. వి.సి.వడివుడయన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్ పతాకంపై పోన్స్ స్టిఫెన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018 ఫిబ్రవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవనుంది.
ఈ సినిమాపై సన్నీలియోన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఒక అద్భుతమైన కథ కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు నాకున్న ఇమేజ్ ను పూర్తిస్థాయిలో మార్చే సినిమా అవుతుందన్న నమ్మకం ఉంది. చాలా రోజుల నుంచి ఒక డైరెక్ట్ తెలుగు సినిమా చేయాలనుకొంటున్నా. దర్శకుడు వి.సి.వడివుడయన్ కథ చెప్పిన మరుక్షణం నుండే ఈ సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాను. యాక్షన్ సన్నివేశాల్లో నటించాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో నాకు మంచి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పుకొచ్చింది.