సన్నిలియోన్‌ సినిమాకి లైన్‌ క్లియర్..

313
Sunny Leone
- Advertisement -

బాలీవుడ్‌ అందాల భామ సన్నీలియోన్ వీరనారిగా కత్తి తిప్పేందుకు ‘వీర మహాదేవి’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. గతంలో ఈ చిత్రంపై పలు అభ్యంతరాలు తెలుపుతూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్‌ను చెన్నై హైకోర్టు శాఖ, మధురై కోర్టు కొట్టివేసింది.

Sunny Leone

 

శృంగార తారగా ముద్ర పడ్డ సన్నిలియోన్‌ వీరమదేవి పాత్రలో నటించడం అంటే వీరమదేవిని అవమానించడమేనని మదురై, సెల్లూరుకు చెందిన సరవణన్‌ అనే న్యాయవాది వెంటనే సినిమా చిత్రీకరణను నిలిపివేయాలని చెన్నై హైకోర్టు, మధురై కోర్టులో ప్రజాహిత వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు.

ఇటీవల విచారించిన కోర్టు ఒక నటిని పలానా పాత్రలో నటించవద్దని చెప్పడం సరికాదని, పాత్రకు సరిపోతారనుకుంటే ఏ పాత్రనైనా చేయవచ్చని కాబట్టి విచారణకు స్వీకరించలేమని కోర్టు పేర్కొంది. దీంతో ఈ సినిమాకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

- Advertisement -