శృంగార తారగా ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించిన సన్నీలియోన్.. ఈ మధ్య బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో హాట్ హాట్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంది. రాజశేఖర్ నటించిన గరుడవేగ మూవీలో ‘డియో.. డియో’ అంటూ ఐటమ్ బాంబ్ పేల్చిన సన్నీ.. త్వరలోనే పూర్తిస్థాయి తెలుగు సినిమాతో ముందుకురాబోతుంది.
యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కనుండగా సినిమాకు వీర మహాదేవి అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శివగంగ ఫేమ్ వి.సి.వడిఉదయన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను మంగళవారం నాడు చెన్నైలో కొబ్బరికాయ కొట్టి ఓపెన్ చేసింది సన్నీ.
రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా గుర్రపు స్వారీ, కత్తి విన్యాసాలను నేర్చుకుంది ఈ గ్లామర్ క్వీన్. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలచేవిధంగా ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు వడి ఉదయన్. మొత్తంగా వీర మహాదేవి సన్సేషన్స్ క్రియేట్ చేయడం ఖామమే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.