ఏ గ్రేడెడ్ సినిమాల్లోనుంచి బాలీవుడ్లోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించిన తార సన్నీలియోన్. బాలీవుడ్లోకి మొదట్లో ఆమెతో నటించేందుకు బాలీవుడ్ నటులు వెనకడుగు వేశారు. తమ పేరు ఎక్కడ చెడిపోతుందో అని ఒకటికి నాలుగుమార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి వచ్చింది. అయితే వీటన్నింటికి భయపడకుండా తాను ఎక్కడ ఉంటే అక్కడ మొదటి స్థానంలో ఉండాలనే స్వభావం కలిగిన నటి కావడంతో.. సవాళ్లకు భయపడకుండా.. ఇబ్బందులను సమర్ధవంతంగా ఎదురుకొని ముందుకు అడుగు వేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో సన్నీలియోన్ తో సినిమాలు చేయడానికి స్టార్స్ సైతం వెనకాడటంలేదు.
ప్రస్తుతం ఈ పోర్న్ భామ అటు సౌత్, ఇటు నార్త్ ఇండస్ట్రీకి సంబంధించిన అన్ని భాషలలో సినిమాలు చేస్తూ అశేష ప్రజాదరణ పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ భామపై ఓ వార్త తెగ ప్రచారంలో ఉంది. అదేంటంటే సన్నీ మలయాళం డెబ్యూ కూడా సిద్ధమైందట. సన్నీ ప్రధాన పాత్రలో బ్యాక్ వాటర్ స్టూడియోస్ పతాకంపై జయలాల్ మీనన్ నిర్మాణంలో దర్శకుడు సంతోష్ నాయర్ ఓ ప్రాజెక్ట్ సిద్ధం చేశాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి రంగీలా అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ విడుదల చేశారు. ఈ ప్రాజెక్ట్ పట్ల తాను ఆసక్తిగా ఉన్నానని సన్నీ లియోన్ తెలిపింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధిచిన నటీనటుల పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.