ప్రముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది సన్నిలియోన్. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సరిసమానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న సన్నిలియోన్ ఇప్పుడు వరుసగా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌లతో చాలా బిజీబిజీగా ఉంటోంది .అయితే డేరింగ్ గా మాట్లాడేయడంలో ఈ మధ్య సన్నిలియోన్ ఆరితేరిపోయింది. ఆ మధ్య ఓ టీవీ ఛానల్ కు పోర్న్ సినిమాలు చేసినందుకు తానేమీ ఫీలవడం లేదంటూ ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన దగ్గర నుంచి అమ్మడి టాకింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది.
పోర్న్ సినిమాలు చేయడం పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని సన్నీ లియోన్ తాజాగా మరోసారి స్పష్టం చేసింది. తన పేరేంటో ప్రపంచానికి తెలిసింది.. తనకింత పేరు తెచ్చిపెట్టింది.. ఈ రోజు తనను ఈ స్థాయికి చేర్చింది పోర్న్ సినిమాలే అని ఆమె అంది. పోర్న్ స్టార్ కాకపోయి ఉంటే.. అన్న ఆలోచన తనకు ఇప్పటికీ అప్పుడప్పుడూ కలుగుతూ ఉంటుందని.. అదే సమయంలో అది లేకపోతే తాను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదన్న విషయం గుర్తుకొస్తుందని సన్నీ చెప్పింది. తన కెరీర్ విషయంలో తాను బాధపడే సందర్భం ఎప్పుడూ రాదని ఆమె తేల్చి చెప్పింది. పోర్న్ సినిమాల్లో నటించడం వల్ల వచ్చిన గుర్తింపు వల్లే ఇప్పుడు బాలీవుడ్లో కూడా అవకాశాలు అందుకోగలుగుతున్నానని ఆమె చెప్పింది.
ఇండియాకు వచ్చి.. బాలీవుడ్లో స్థిరపడి.. ఇక్కడ ఓ బిడ్డను కూడా దత్తత తీసుకోవడం గొప్ప అనుభవమని.. బాలీవుడ్లోకి వచ్చి.. ఇక్కడి పరిస్థితుల్ని అర్థం చేసుకుని.. తనను తాను మార్చుకున్న తర్వాత తీసుకున్న గొప్ప నిర్ణయం.. బిడ్డను దత్తత తీసుకోవడమని సన్నీ అభిప్రాయపడింది. పోర్న్ కెరీర్ వేరని.. అది ముగిసిన అధ్యాయమని.. బాలీవుడ్లో తాను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందనిపిస్తోందని.. తాను ఇంకా ఇక్కడ ఆరంభ దశలోనే ఉన్నట్లు భావిస్తున్నానని సన్నీ చెప్పింది. ఐటెం పాటలకే పరిమితం కాకుండా ఇంకా ఏదో చేయాలన్న తపన తనలో ఉందని.. మున్ముందు అలాంటి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని ఆమె అంది.