బీసీ ప్రజాప్రతినిధులతో భేటీ అయిన కేసీఆర్..

89
CM KCR holds meet on BC Welfare

అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, అన్ని పార్టీలకు చెందిన బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.

ఈ సమావేశం సందర్భంగా బీసీలకు సీఎం మరిన్ని వరాలు ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు అమలవుతున్న పథకాలపై సీఎం సమీక్షిస్తున్నారు. బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజు చెల్లింపు ప్రకటన చేసే అవకాశం ఉంది. వందకు పైగా కొత్త గురుకులాలు, బీసీల కోసం మరో 15 డిగ్రీ కాలేజీలు ప్రకటించే అవకాశం ఉంది. ఎంబీసీ కార్పొరేషన్ రుణాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పలు సామాజికవర్గాలకు భారీగా నిధుల ప్రకటనకు అవకాశం ఉంది.