సన్నీ కోసం ఎగబడ్డారు..!

194
Sunny Leone Makes Kochi Go Berserk With Her Arrival
- Advertisement -

స్క్రీన్‌ మీద బాలీవుడ్ నటి సన్నీలియోన్‌ కనడతే చాలు యూత్‌ అంతా అరుపులూ కేకలతో తెగ హంగామా చేసేస్తారు. ఆ హంగామా కేవలం ధియేటర్‌ లోనే అనుకుంటే మాత్రం పొరపాటే. సన్నీ ఎక్కడ అడుగు పెట్టినా సన్నీని చూడడానికి ఫ్యాన్స్‌ ఎగబడాల్సిందే.

తాజాగా కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఆవిష్క‌ర‌ణ కోసం వ‌చ్చిన స‌న్నీ లియోన్‌ను చూడ‌టానికి జ‌నం భారీగా త‌ర‌లి వ‌చ్చారు. వ‌చ్చిన జ‌నాన్ని చూసి సన్నీ షాకైపోయింది. వారు చూపిస్తున్న ప్రేమ‌కు, అభిమానానికి ఆమె ట్విట్ట‌ర్ వేదిక‌గా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.Sunny Leone Makes Kochi Go Berserk With Her Arrival

కొచ్చిలోని ఎంజీరోడ్‌లో `ఫోన్‌4 డిజిట‌ల్ హ‌బ్‌` ప్రారంభోత్స‌వానికి సన్నీ హ‌జ‌రైంది. ఆమె రావ‌టం ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసినా స‌న్నీ కోసం గంట‌ల త‌ర‌బ‌డి అభిమానులు ఎదురుచూశార‌ని నిర్వాహ‌కులు తెలిపారు.

ఆమె వ‌చ్చాక అభిమానులంతా `వియ్ ల‌వ్ స‌న్నీ` అంటూ నినాదాలు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను స‌న్నీ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో షేర్ చేసింది. `కేర‌ళ అభిమానులు చూపించిన ప్రేమ‌ను నా జీవితంలో మ‌ర్చిపోలేను` అంటూ స‌న్నీ లియోన్ ట్వీట్ చేసింది.

- Advertisement -