బాద్‌ షాతో ఇదో గొప్ప జ్ఞాపకం

237
Shoaib shares throwback moment with SRK
- Advertisement -

షోయబ్ అక్తర్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అవసరం లేని పేరు. ఆన్ ది ఫీల్డ్‌లోనే కాక, ఆఫ్ ది ఫీల్డ్‌లో కూడా దుందుడుకు స్వాభావంతో అప్పట్లో నిత్యం వార్తల్లో నిలిచేవాడు. అనతికాలంలోనే ప్రపంచ మేటి బౌలర్‌గా ఎదిగి.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ  రావాల్పిండి ఎక్స్ ప్రెస్‌ పాక్‌కు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు.

ఇక ఐపీఎల్‌లో సైతం సత్తా చాటిన అక్తర్ బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఐపీఎల్‌లో షారుక్‌ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకి అక్తర్‌ 2008లో ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

2008లో ఐపీఎల్‌ టోర్నీలో భాగంగా దిల్లీ డేర్‌డెవిల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అక్తర్‌ 11 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో 130 పరుగుల చేయాల్సిన దిల్లీ జట్టు 110 పరుగుల వద్దే చతికిలపడింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన అక్తర్‌కి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది. విజయానందంలో అక్తర్‌.. షారుక్‌ని ఎత్తుకుని మైదానంలో కలియ దిరిగాడు. ఈ ఫొటోనే అక్తర్‌ ఇప్పుడు ట్విటర్‌లో ఉంచాడు.

సూపర్‌ స్టార్‌ షారుక్‌తో గొప్ప జ్ఞాపకం ఇది. అతను చాలా మంచి వ్యక్తి. స్నేహితుడు. ఎంతో మర్యాదస్తుడు కూడా అని షోయబ్‌ అక్తర్‌ పేర్కొన్నాడు.

- Advertisement -