ఐటమ్స్‌తో అదరగొడుతున్న సన్నీ..

227
Sunny Leone Item Song In PSV Garuda Vega Movie
- Advertisement -

ప్ర‌ముఖ పోర్న్‌స్టార్ రేంజ్ నుంచి బాలీవుడ్ స్టార్ రేంజ్‌కు ఎదిగిపోయింది స‌న్నిలియోన్‌. బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో స‌రిస‌మానమైన క్రేజ్‌తో దూసుకుపోతోన్న స‌న్నిలియోన్ ఇప్పుడు వ‌రుస‌గా సినిమాలు, ఐటెం సాంగ్‌లు, లైవ్ పెర్పామెన్స్‌ల‌తో చాలా బిజీబిజీగా ఉంటోంది.ఈ అమ్మడు బాలీవుడ్ లో ఐటం సాంగులకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది సన్నీ లియోన్. ఇటీవల బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సినిమా రయీస్ లో లైలా లైలా పాటతో అందరికీ మత్తెక్కించిన సన్నీ రీసెంట్ గా బాద్షాహో – నూర్ సినిమాల్లో చేసిన ఐటం సాంగ్స్ తో మరింత క్రేజ్ పెంచుకుంది. ఆమధ్య మంచు మనోజ్ హీరోగా వచ్చిన కరెంట్ తీగ సినిమాలో సన్నీలియోన్ కనిపించింది. ఈ మధ్య యూత్ లో ఆమె క్రేజ్ బాగా పెరిగింది. దీంతో మరోసారి ఆమె తెలుగు తెరపై తన చిందులతో సందడి చేయనుంది.

Sunny Leone Item Song In PSV Garuda Vega Movie

రాజశేఖర్ హీరోగా వస్తున్న పి.ఎస్.వి. గరుడవేగ 126.18ఎం సినిమాలో సన్నీలియోన్ ఐటం సాంగ్ చేయనుంది. ఇందుకోసం ఆమెకు ఆఫర్ చేసిన మొత్తం తెలిస్తే ఇప్పుడు ఐటం సాంగ్స్ చేస్తున్నవారంతా అసూయ పడాల్సిందే. ఒక్కపాట కోసం ఆమెకు రూ. 50 లక్షలు ముట్టచెబుతున్నారట. ‘‘సన్నీ లియోన్ ఐటం సాంగ్స్ ను సెలక్టివ్ గానే చేస్తోంది. చాలా ఆఫర్లను కాదని కూడా అంటోంది. ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా భారీ మొత్తమే ఇచ్చాం. అయితే అది ఎంత అన్నది బయటకు చెప్పలేం’’ అని యూనిట్ చెందిన వారు తెలిపారు.

కమర్షియల్ సినిమాకు ఎన్ని హంగులున్నా అందులో ఐటం ఉంటే ఆ కిక్కే వేరు. నిన్న మొన్నటివరకు ఫేడవుట్ అయిపోతున్న హీరోయిన్లు ఐటం సాంగులు చేసేవారు. ఇప్పుడు క్రేజ్ లో ఉన్న హీరోయిన్లే ఐటం సాంగులు చేసేందుకు రెడీ అంటున్నారు. తక్కువ టైం.. తక్కువ శ్రమతో ఫ్యాన్సీ అమౌంట్ తో ఐటం సాంగులకు ఆఫర్లు వస్తుండటమే అందుకు కారణం. టాలీవుడ్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్ – తమన్నా – శ్రుతిహాసన్ – శ్రియ ఇలా వీళ్లంతా ఐటం సాంగ్స్ తో చేసినవారే. కానీ సన్నీలియోన్ రెమ్యూనరేషన్ విషయంలో వీళ్లందరినీ దాటి రేసులో ముందుకెళ్లిపోయింది.

- Advertisement -