మెహ్రీన్ చాలా అందంగా ఉందన్న కాజల్‌

450
Mehreen Kaur Pirzada floored by Kajal Aggarwal’s affection
Mehreen Kaur Pirzada floored by Kajal Aggarwal’s affection
- Advertisement -

గత యేడాది విడుదలైన ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’లో మహాలక్ష్మిగా కనిపించి మెప్పించిన మెహ్రీన్‌ అప్పుడే అరడజను సినిమాలు సైన్‌ చేసింది. రవితేజ ‘రాజా ది గ్రేట్‌’, సాయిధరమ్‌తేజ ‘జవాన్‌’లతో త్వరలో కనువిందు చేయనున్న ఈ పంజాబ్‌ భామ శర్వానంద్‌, వరుణ్‌తేజ్‌, సందీప్‌కిషన్‌లతో కూడా జత కడుతోంది. ఈ సినిమాలు హిట్ కొడితే తెలుగులో ఆమె కెరీర్ స్పీడ్ అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెహ్రీన్‌ ను చూస్తే కాజల్ అగర్వాల్‌లా ఉంటుందని చాలా మంది అంటుంటారు.

A Busy Year Ahead For Mehreen

అదే విషయాన్ని మెహ్రీన్ తో ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా చెప్పడంతో కాజల్ తనకంటే చాలా అందమైనదనీ .. ఆల్రెడీ ఆమె చాలా పాప్యులర్ అనీ అంటూ కాజల్ గురించి మెచ్చుకోలుగా మాట్లాడింది. ఈ విషయంపై కాజల్ కూడా ట్విట్టర్ ద్వారా స్పందించింది. మెహ్రీన్ చాలా అందంగా ఉంటుందంటూ కితాబునిచ్చేసింది. స్టార్ హీరోయిన్ అలా తన గ్లామర్ ను గురించి మెచ్చుకుంటూ కాంప్లిమెంట్‌ ఇవ్వడంతో మురిసిపోయింది మెహ్రీన్.

kajal qeen

ఇక మెహ్రీన్, శర్వానంద్ జోడిగా వస్తున్న సినిమా ‘మహానుభావుడు’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక డిఫరెంట్ కాన్సెప్టుతో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాలో హీరో అతిశుభ్రత అనే వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్‌కు లవ్ స్టోరీ జోడించి, కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి సినిమా తెరకెక్కించారు.

- Advertisement -