కాంగ్రెస్‌లో ముదిరాజ్‌లకు అన్యాయం:సునీతారావు

1
- Advertisement -

ముదిరాజ్ బిడ్డకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందన్నారు తెలంగాణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీత రావు. పార్టీ కోసం లేబర్‌లా పని చేస్తే నన్ను పదవి నుండి తొలగిస్తామని అంటున్నారు అన్నారు.

నేను వద్దు మొర్రో అంటే కూడా గోషామహల్ సీటు ఇచ్చారు.. నేను ఓడిపోతే నన్ను పదవి నుండి తొలగిస్తారా? అని ప్రశ్నించారు. ఆలా ఐతే ఓడిపోయిన సరితా తిరుపతయ్యకు నా పదవి ఎలా ఇస్తారు? గత ఎన్నికల్లో ఓడిపోయిన గద్దర్ బిడ్డ వెన్నెలకు పదవి ఎలా ఇచ్చారు? అన్నారు.

గతంలో ఓడిపోయిన వెంకట్ బల్మూరికి ఎన్‌ఎస్‌యూఐ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ రెండు పోస్టులు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గెలుపు కోసం లేబర్‌లా కష్టపడ్డా.. నన్ను తొలగించి అన్యాయం చేస్తారా? అని మండిపడ్డారు.

Also Read:ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలులో వేస్తారా?:పోసాని

- Advertisement -