ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి వెళ్ళిన I&PR అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవిని అనుమతించకుండా అరెస్ట్ చేస్తామని అన్నారు.. దానికి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు అన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి. ఈ ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేదు అన్నారు.
ఆటో డ్రైవర్ల సమస్యలు తెలుసుకునేందుకు ఆటోలో ప్రయాణించారు బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు. న్యూ ఎమ్మెల్యే క్వార్ట్రర్స్ నుండి బుద్దభవన్‌లోని మహిళా కమిషన్‌కు ఆటోలో బయలుదేరారు బీఆర్ఎస్ మహిళా నాయకులు మాలోతు కవిత, సునీతా లక్ష్మారెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, కార్పొరేటర్ హేమ సామల ఇతర మహిళా ప్రజాప్రతినిధులు.
తెలంగాణ మంత్రులు, మహిళా అధికారులను ఇంటికి పిలిపించుకొని రివ్యూలు చేస్తున్నారని ఆంధ్రజ్యోతిలోనే రాశారు… దీనిపై ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ ను కోరుతున్నాం అన్నారు సునీతా లక్ష్మారెడ్డి.
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోకి I&PR అసిస్టెంట్ డైరెక్టర్ హర్ష భార్గవిని అనుమతించలేదు సిబ్బంది. హర్ష భార్గవి ఎవరో తమకు తెలియదంటూ అనుమతించకుండా, గేట్ బయట నిలబడితే అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు పోలీసులు.దీంతో ఆమె కంటతడి పెట్టుకున్నారు.

