విజయవాడ దుర్గ గుడిలో వైసీపీ నేత ప్రమాణం

9
- Advertisement -

కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని విజయవాడ దుర్గ గుడిలో ప్రమాణం చేశారు మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్. కల్తీ మద్యం పేరుతో నా హృదయం గాయ పరిచారు…. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మ వారి సాక్షిగా చెబుతున్న నేను తప్పు చేయలేదు, చేయను అని తేల్చిచెప్పారు. ఏడు కొండలు సాక్షిగా, ఇంద్రకీలాద్రి సాక్షిగా ప్రమాణం చేసేందుకు రావాలని సీఎం చంద్రబాబును అడిగాను అన్నారు.

కల్తీ మద్యం కేసులో నార్కో ఎనాలిసిస్, లైవ్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధంగా ఉన్నానని జోగి రమేష్ తెలిపారు.

Also Read:ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టవా?:హరీష్

- Advertisement -