ఉమెన్ ట్రాఫికింగ్ పై సునీతా లక్ష్మారెడ్డి ఆరా

40
sunitha
- Advertisement -

మానవ అక్రమ రవాణా పై తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి ఆరా తీశారు. రాష్ట్రంలో గతంలో , తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక ఎంత వరకు కట్టడి చేయగలిగామో పోలీసు అధికారులతో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆారా తీశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో నమోదు అయిన కేసుల వివరాలు అందజేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.

మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలని సునీతా లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా తర్వాత ప్రపంచంలో అతిపెద్ద వ్యవస్థీకృత నేరంగా మానవ అక్రమ రవాణా అవతరించిందని చైర్ పర్సన్ ఆవేదన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణాతో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అమాయకుల జీవితాలు బలి అవుతున్నాయని ఛైర్ పర్సన్ ఆవేదన చెందారు. మానవ అక్రమ రవాణా కట్టడికి పోలీసు శాఖ చేస్తున్న కార్యకలాపాల గురించి ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోలీసు అధికారులు స్పందిస్తూ ప్రతి రోజు 50 నుండి 60 మిస్సింగ్ కేసులు నమోదు అవుతుండగా అందులో 20 శాతం 15 నుండి 20 సంవత్సరాల లోపు వారేనని వివరించారు. నమోదు అవుతున్న మిస్సింగ్ కేసులలో అధిక శాతం ఇతర రాష్ట్రాల పిల్లలు, బాలకార్మికులేనని, వీరందరినీ గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లాల్లో ఏ.హచ్. టి లు ఏర్పాటు చేశామని అలాగే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి మరియు ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -