- Advertisement -
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి అత్యాచారం ఘటన దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి. మంగళవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించిన ఆమె…అత్యాచార ఘటనపై సూపరింటెండెంట్‌తో చర్చించారు.
బాధిత మహిళలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని, దోషులపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. పూర్తి విచారణ తర్వాతే వాస్తవాలు వెల్లడవుతాయని చెప్పారు. ఆస్పత్రి నుంచి రోగి సమాచారం ఇవ్వకుండా వెళ్లినట్లు తెలిపారు. అత్యాచార ఆరోపణలపై పోలీసుల దర్యాప్తు జరుగుతోందని మరోవైపు ఆస్పత్రి కూడా విచారణ జరుపుతోందన్నారు.
గాంధీ దవాఖానలో పేషేంటుకు సహకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు దవాఖాన సిబ్బంది ఒకరు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
- Advertisement -