ఏదో అయిపోతుంది.. ఏదో జరిగిపోతుంది.. అంటూ హస్తం పార్టీ నేతలు ప్రదర్శిస్తున్న ఢాంభికం వెనుక సునీల్ కనుగోలు వ్యూహరచన ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఖాళీగా ఉన్న డబ్బాకు సౌండ్ ఎక్కువ అన్నట్లు.. క్షేత్ర స్థాయిలో ఏ మాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీ వ్యూహ కర్త సునీల్ కనుగోలు. అయితే హస్తం పార్టీ ప్రచారాలు, ప్రకటనలు, హడావిడి అంతా కూడా కేవలం సోషల్ మీడియాలో తప్పా బయట ఏమాత్రం లేదనేది అక్షర సత్యం. హస్తం పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు ప్రజలు మొఖం చాటేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నివహించిన ప్రజా భరోసా సభకు ప్రజలు లేక హస్తం నేతలే ముఖం చిన్నబుచ్చుకున్న పరిస్థితులు కనిపించాయి. .
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సభకు వచ్చిన్నప్పటికి కూడా ఒట్టి కుర్చీలే ఆహ్వానం పలికాయి. ఇక ఎక్కడ చూసిన కాంగ్రెస్ కు ప్రజల నుంచి ఇదే రీతిలో వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. కానీ సోషల్ మాత్రం మసిపూసి మారేడు కాయ చేసినట్లుగా హస్తం పార్టీకి హైప్ ఇచ్చేలా కనుగోలు వ్యూహరచన చేస్తున్నారు. అయితే ఏది వాస్తవం ఏది అవాస్తవం అని తెలుసుకోవడంలో తెలంగాణ ప్రజలు స్థితప్రజ్ఞులు. ఆ రకంగా చూస్తే హస్తం పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసిన వాటిని ప్రజలు తిప్పికొడతారనేది కొందరు రాజకీయ వాదులు చెబుతున్న మాట. కాగా సునీల్ కనుగోలు స్ట్రాటజీల కారణంగానే కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలోకి వచ్చిన సంగతి విధితమే. అదే వ్యూహాలను ఇక్కడ అమలు చేస్తే ఆ రాష్ట్ర ప్రజల మాదిరి తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనేది ఆ పార్టీ గ్రహించాల్సిన విషయం.
Also Read:KTR:బీఆర్ఎస్‌తోనే భవిష్యత్