శ్రీను వైట్ల డైరెక్షన్‌లో సునీల్‌..?

233
- Advertisement -

బెస్ట్ కామెడియన్ గా టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ హీరోగా సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. హీరోగా సినిమాలు బాగానే చేశాడు గాని విజయాలను మాత్రం చాలా తక్కువ అందుకున్నాడు. అయితే ఫైనల్ గా తన నిర్ణయాన్ని సునీల్ మార్చుకోవడంతో స్టార్ దర్శకులు అందరు ఇప్పుడు సునీల్ వైపే చూస్తున్నారు. ఎందుకంటే మనోడు కామెడీ పాత్రలను కూడా చేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు.

Sunil in Raviteja Srinu Vaitla Movie?

అయితే శ్రీను వైట్ల తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మించనున్న ఈ సినిమాలో రవితేజ కథానాయకుడిగా నటించనున్నాడు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సునీల్ ను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. సునీల్ ను దృష్టిలో పెట్టుకునే శ్రీను వైట్ల ఈ పాత్రను పూర్తి వినోదాత్మకంగా మలిచాడట.శ్రీను వైట్ల సినిమాలో కామెడీ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో వుంటాయో తెలిసిందే.

అలాగే ఈ సినిమాలోను కడుపుబ్బా నవ్వించే కామెడీ ఉంటుందట. పెద్ద హీరోల సినిమాల్లో కమెడియన్ గా చేయాలని నిర్ణయించుకోవడం వలన, శ్రీను వైట్ల సినిమాల్లో గతంలో చేసిన పాత్రలు తనకి మంచి పేరు తీసుకురావడం వలన సునీల్ వెంటనే అంగీకరించాడని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లోను ..’ సైరా’లోను సునీల్ చేయనున్నాడు.

- Advertisement -