పాట మొత్తం పంచెకట్టుతో మహేష్‌..

203
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను అన్నివిధాలుగా మెప్పించేలా శ్రీమంతుడు సినిమా తీసి అతడి కెరీర్ లో ఓ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు హ్యాట్రిక్ చిత్రాల సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ. ప్రస్తుతం వరస పరాజయాలతో కాస్త డల్ అయిన మహేష్ అభిమానుల్లో జోష్ నింపేలా ప్రస్తుతం తీస్తున్న ‘భరత్ అనే నేను’ సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా చూస్తున్నాడు. ఈ సినిమాలో మహేశ్‌ ముఖ్యమంత్రిపాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని ఓ పాటలో మహేశ్‌ పంచెకట్టుతో డ్యాన్స్‌ చేయనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. 2006లో వచ్చిన ‘పోకిరి’ చిత్రంలో ‘చూడొద్దంటున్నా చూస్తూనేవుంటా..’ పాటలో మహేశ్‌ లుంగీ కట్టుకుని డ్యాన్స్‌ చేశారు.

Mahesh Wears Lungi Again For Bharat Ane Nenu

ఆ తర్వాత 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రంలో మహేశ్‌ లుంగీ ధరించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. కానీ ఇప్పుడు ‘భరత్‌ అనే నేను’ చిత్రంలో మాత్రం మహేశ్‌ ఓ పాట మొత్తంలో పంచెకట్టుతోనే కన్పించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2018 ఏప్రిల్‌లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -