కామెడీ పాత్రలకు సై అంటున్న సునీల్‌..

302
Comedian Sunil
- Advertisement -

టాలీవుడ్‌లో కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన సునీల్ కు కాలం కలిసిరాలేదు.. మర్యాద రామన్న లాంటి గ్రాండ్ హిట్ కొట్టాక వరుస ఫ్లాపులు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సరైన హిట్ దక్కలేదు. సోలో హీరోగా కంటిన్యూ అవ్వడం కష్టమని తేలిపోవడంతో తిరిగి కమెడియన్ గా మారిపోయాడు. అంతే ఇక వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి.

Comedian Sunil

ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తోన్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాలో సునీల్ కమెడియన్ గా చేస్తున్నాడు. ఇక శర్వానంద్ తాజా చిత్రంలోను కమెడియన్ గా సునీల్ సందడి చేయనున్నాడు. తాజాగా సునీల్ మరో సినిమాకి ఓకే చెప్పాడు. అంతేకాదు సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ మూవీక ‘చిత్రలహరి’ బార్ అండ్ రెస్టారెంట్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర కోసం సునీల్ ను తీసుకున్నట్టుగా సమాచారం. మొత్తానికి కమెడియన్‌గా సై అనడంతో సునీల్ కు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

- Advertisement -