నవంబర్‌లో రాజమౌళి #RRR ప్రారంభం..!

187

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో దర్శకధీరుడు రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకూ ఈ ముగ్గురి పేర్లు తప్ప మరొకరి పేరు బయటకు రాలేదు. ఇటీవల ‘భారీ మల్టీస్టారర్‌ షురూ అయింది’ అంటూ రాజమౌళి..రామారావు..రామ్‌చరణ్‌ ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘R’ వచ్చేలా #RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను పంచుకున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందా అనే ఆసక్తితో అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. ఇటు చరణ్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం. ఈ షెడ్యూల్‌లో ముందుగా ఒక హీరోకి సంబంధించిన సన్నివేశాలను .. ఆ తరువాత మరో హీరోకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

SS Rajamouli

ఆ తరువాత ఇద్దరు హీరోల కాంబినేషన్లోని సీన్స్ ను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణకు అవసరమైన భారీ సెట్స్ నిర్మాణం మొదలైంది. నవంబర్ నుంచి ఎన్టీఆర్ .. డిసెంబర్ నుంచి చరణ్ ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్టు చెబుతున్నారు. ఇక కథానాయికలుగా ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది చూడాలి. ఈ ప్రాజెక్టును డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు.