రానా నాయుడులో సునీల్ గ్రోవర్!

5
- Advertisement -

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో వచ్చిన సిరీస్ రానా నాయుడు. దగ్గుబాటి రానా – వెంకటేష్ మల్టీస్టారర్‌గా వచ్చిన ఈ సిరీస్ ఓటీటీలోనే సరికొత్త రికార్డులు సృష్టించింది. తాజాగా రానా నాయుడు సీజన్ 2 రాబోతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ప్రముఖ నటుడు సునీల్ గ్రోవర్…రానా నాయుడు సీజన్ 2లో భాగమయ్యారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను ఎవరి ఉహకు అందని విధంగా నెట్‌ఫ్లిక్స్ సిద్ధం చేసి విడుదల చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, సునీల్ గ్రోవర్ ఇద్దరూ కనిపించారు. సీరియస్‌గా, కఠినంగా కనిపించే రానా నాయుడు ప్రపంచంలోకి తనదైన మార్క్ ఉన్మాదంతో ఉన్న సునీల్ ప్రవేశించాడు.

రానా దగ్గుబాటి మరియు నేను ఒకే ఫ్రేమ్‌లో? అస్సలు ఉహించలేదన్నారు సునీల్ గ్రోవర్. రానా నాయుడు పవర్‌ఫుల్ మలుపులు, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌తో కూడిన తీవ్రమైన, కఠినమైన ప్రపంచం. అలాంటి లోకంలోకి నా ఎంట్రీ అనేది నా స్టైల్లోనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ ఈ ఐడియా గురించి నాకు చెప్పగానే నాకు అద్భుతంగా అనిపించింది అని సునీల్ తెలిపారు. మిమ్మల్ని నవ్విస్తూనే అసలేం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తూ మరింతగా చూడాలనిపించేలా ఉండే సందర్భం అన్నారు.

రానా దగ్గుబాటి మాట్లాడుతూ….సునీల్ గ్రోవర్ కనిపించగానే మీరు ఊహించలేని పరిస్థితులను చూస్తామనే భావమనైతే కలుగుుతుంది. రానా నాయుడులా చక్కటి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తాను. పంచ్‌లనే కాదు పంచ్ లైన్‌‌లను కూడా తప్పించుకుంటాను. ఇలాంటి ఓ వైల్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మీకు అందించటానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమైంది అని చెప్పాడు. ఈ అవైటెడ్ సీజన్ జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రాబోతుంది.

Also Read:TVKలోకి మాజీ ఐఆర్ఎస్ అధికారి!

- Advertisement -