దేశంలో 8 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. తమిళనాడులో ఆరు, అసోం రెండు సీట్లు ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఆరుగురు రాజ్యసభ సభ్యుల పదవీలం 2025 జూలై 25న ముగియనుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ జూన్ 2న ప్రారంభమవుతుంది. ఆరు సీట్లకు గానూ 4 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు డీఎంకే ప్రకటించింది.
డీఎంకే, మక్కల్ నీది మయ్యం పార్టీ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ హాసన్‌ను రాజ్యసభకు పంపిస్తామని డీఎంకే వెల్లడించింది. ఈ మేరకు ఒక స్థానానికి కమల్ హాసన్‌కు కేటాయించింది. ఇప్పటికే రాజ్యసభ ఎంపీగా ఉన్న న్యాయవాది విల్సన్‌కు డీఎంకే మరోసారి అవకాశం ఇచ్చింది. మిగిలిన రెండు స్థానాలకు ఎస్ఆర్ శివలింగం, రుక్యయ్య మాలిక్ అలియాస్ కవిగ్నార్ సల్మాను కేటాయించినట్లు ప్రకటనలో పేర్కొంది.
2018లో కమల్ హాసన్ ఎంఎన్ఎం పార్టీని స్థాపించారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. తమిళనాడులో అధికారిక డీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో నాలుగు స్థానాల్లో విజయం సాధించడం ఖాయం.
Tamil Nadu | Salma, Advocate P Wilson and SR Sivalingam have been announced as DMK candidates for Rajya Sabha.
One seat has been allocated to Makkal Needhi Maiam as per the earlier agreement. pic.twitter.com/BLw8g1j3Pg
— ANI (@ANI) May 28, 2025
Also Read:TVKలోకి మాజీ ఐఆర్ఎస్ అధికారి!

