పంత్ కామెంట్లపై సునీల్ గవాస్కర్

3
- Advertisement -

cముఖ్యంగా మ్యాచ్ ఓడిపోయిన వెంటనే కెప్టెన్లను ఇంటర్వ్యూల కోసం లాగకుండా, వారు కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి సమయం ఇవ్వాలని గవాస్కర్ పేర్కొన్నారు. గత సోమవారం, 2026 ఐపీఎల్ (IPL) రేసు నుండి లక్నో సూపర్ జెయింట్స్ నిష్క్రమించిన తర్వాత జరిగిన లైవ్ ఇంటర్వ్యూలో పంత్ తీవ్ర నిరాశతో మేము ఒక ఎఫ్‌… (F******) మంచి టీమ్ అంటూ బూతు పదాన్ని ఉపయోగించారు. ఆ సమయంలో వ్యాఖ్యాత యాన్ బిషప్ వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, పంత్ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో భారీ దుమారం రేపింది.

అయితే, ఈ విషయంలో పంత్‌ను తప్పుబట్టలేమని గవాస్కర్ అన్నారు. ఘోర పరాజయం చవిచూసిన కొద్ది నిమిషాలకే మాట్లాడమనడం వల్ల ఎవరైనా భావోద్వేగాలను నియంత్రించుకోలేరని, ఐపీఎల్ లాంటి హై-ప్రెజర్ టోర్నమెంట్‌లో నిరాశ, కోపం రావడం సహజమని ఆయన సమర్థించారు.

మ్యాచ్ ముగిసిన కొద్ది నిమిషాలకే, ఓడిపోయిన కెప్టెన్‌ను ఇంటర్వ్యూ చేయడం అంత అవసరమా? అని రిషభ్ పంత్ నోరుజారిన ఘటన ఆలోచింపజేస్తోంది. అది కూడా చివరి ఓవర్ వరకు సాగి ఓడిపోయిన మ్యాచ్ అయితే కెప్టెన్‌కు బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అందులోనూ అతడు వికెట్ కీపర్ కూడా అయి ఉండి, అంతటి ఎండలో ప్రతి బంతికి వికెట్ల వెనుక అటు ఇటు పరిగెత్తి ఉంటే ఆ అలసట, కోపం మరింత పెరుగుతాయి అన్నారు సునీల్ గవాస్కర్.

దీనికి బదులుగా, గెలిచిన జట్టులోని ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో మొదట మాట్లాడి, ఓడిపోయిన కెప్టెన్ మొహంపై కాస్త నీళ్లు చల్లుకుని, స్థిమితపడటానికి కొంచెం సమయం ఇవ్వడం మంచిది. ఎలాగూ ప్రెజెంటేషన్ వేడుకకు కొంత సమయం పడుతుంది కాబట్టి, ఓడిన కెప్టెన్‌కు మరికొన్ని నిమిషాల సమయం ఇస్తే ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవచ్చు అన్నారు.

అయితే పంత్ ప్రవర్తన ఒక ముఖ్యమైన చర్చకు దారితీసింది. సాధారణంగా ఎప్పుడూ మైదానంలో నవ్వుతూ, అల్లరి చేస్తూ ఉండే పంత్.. 2024 మెగా వేలంలో సంజీవ్ గోయెంకాకు చెందిన ఎల్‌ఎస్‌జీ (LSG) జట్టుకు ఎంపికైనప్పటి నుండి ఐపీఎల్‌లో చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మ్యాచ్ ముగిసిన 10 నుండి 15 నిమిషాల తర్వాత ప్రెజెంటేషన్ వేడుకలో కెప్టెన్లు మాట్లాడతారు. కానీ ఐపీఎల్‌లో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, కెప్టెన్ల ముఖంపై నేరుగా మైకులు పెట్టే ముందు వారికి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వాలని గవాస్కర్ బ్రాడ్‌కాస్టర్లను కోరారు.

Also Read:కేకేఆర్ ఆటగాళ్లపై రహానే ప్రశంసలు

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఉత్సాహంగా ఉంటూ, తనదైన శైలిలో ఆటను ఆస్వాదించే ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు. అలాంటి వ్యక్తి కూడా సహనం కోల్పోయాడంటే.. ఓడిపోయిన కెప్టెన్ కాస్త శ్వాస తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ముఖంపై మైక్ పెట్టడం కంటే, తన ఆలోచనలను సరిచేసుకోవడానికి మరికొన్ని నిమిషాల సమయం ఇవ్వాలనే వాదనకు ఇది బలమైన నిదర్శనం అని గవాస్కర్ ముగించారు.

- Advertisement -